గోతిలో దిగబడిన ధాన్యం బస్తాల లారీ
ఆకివీడు, జూలై 4: రహదారులపై పెద్ద పెద్ద గోతులతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. పట్టణ పరిధిలో రోడ్లు గోతులతో చెరువులు, కాలువలను తలపిస్తున్నాయి. ఆకివీడు నుంచి అయి భీమవరం వైపు వెళుతున్న ధాన్యం బస్తాల లోడు లారీ గోతిలో దిగబడింది. ధాన్యం బస్తాలు కిందపడి పోవడంతో నీళ్లలో పడి తడిచిపోయాయి. లారీ దిగబడడంతో సుమారు 3 గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద అమిరంలో మోదీ సభ కారణంగా వాహనాలు, భీమవరం – విజయవాడ బస్సులు ఆకివీడు నుంచి అయి భీమవరం మీదుగా మళ్లించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రధాని సభకు వెళ్ళవలసిన బస్సులు కూడా నిలిచిపోయాయి. ధాన్యం బస్తాలు మరొక లారీలోకి మార్చిన తరువాత ట్రాఫిక్ క్లియర్ అయింది.