దమ్ము చక్రాలతో రహదారులు ఛిద్రం

ABN , First Publish Date - 2022-07-07T05:15:45+05:30 IST

గ్రామీణ రహదారులు అంతంతమాత్రంగా ఉన్నాయి.

దమ్ము చక్రాలతో రహదారులు ఛిద్రం
రావిపాడు – రాచర్ల రహదారిలో దమ్ము చక్రాల ట్రాక్టర్‌

పెంటపాడు, జూలై 6: గ్రామీణ రహదారులు అంతంతమాత్రంగా ఉన్నాయి. గోతులు, బురదతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సారా సాగు నేపథ్యంలో దమ్ము చక్రాలతో ట్రాక్టర్ల రాకపోకల కారణంగా రహదారులు ఛిద్రమవుతున్నాయి. చక్రాలకు కనీసం బెల్టులు కూడా పెట్టడం లేదు. గ్రామాల్లో ప్రధాన రహదారుల మీదుగా ఇవి ప్రయాణిస్తున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక రెవెన్యూ అధికారులు దమ్ము చక్రాలతో రహదారులపై ప్రయాణాలు సాగించకూడదని అవగాహన కల్పించాల్సి ఉన్నా ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రహదారులపై వెళ్లకుండా  చర్యలు చేపట్టాలని  ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-07-07T05:15:45+05:30 IST