పశ్చిమ గోదావరి: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2,500 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్లు, మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్లతో ఏలూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం 11వేల 58 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడైన 8,300 రోడ్లకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టామని ఆయన తెలిపారు. పశ్చిమలో 220 కోట్లతో 83 కిలోమీటర్ల రోడ్డు పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. మే నెల నాటికి 90% పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి