నాణ్యత నేతిబీర!

ABN , First Publish Date - 2022-07-03T05:12:32+05:30 IST

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాల్లో నాణ్యతకు కాంట్రాక్టర్లు తిలోదకాలిస్తున్నారు.

నాణ్యత నేతిబీర!
ఇసుకతో పగుళ్లను నింపిన కాంట్రాక్టరు

ఏజెన్సీలో నాసిరకంగా ఆర్‌అండ్‌బీ పనులు

రహదారి పగుళ్లను ఇసుకతో కప్పిన కాంట్రాక్టర్‌

తనిఖీల్లో దొరక్కుండా జాగ్రత్తపడిన వైనం

దుమ్ముగూడెం, జూలై 2: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాల్లో నాణ్యతకు కాంట్రాక్టర్లు తిలోదకాలిస్తున్నారు. పనుల వద్ద ఒకసారి ఏదైనా మావో యిస్టుల అలజడి జరిగితే చాలు....ఇక అక్కడ కాంట్రాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాట. ఇక అక్కడ ఏదో ఒకలా పనులు పూర్తిచేస్తే చాలన్నట్లుగా ఇంజనీరింగ్‌శాఖ అధికారులు సైతం కాంట్రాక్టర్లకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. దీంతో కొందరు కాం ట్రాక్టర్లు కేవలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనులు చేసి అధిక లాభాలు గడించేందుకు ఆసక్తి కనబరుస్తుండగా, ఇంజనీరింగ్‌ అధికారులు సైతం వారికి పూర్తి మద్దతు తెలపుతున్నట్లుగా కనబడుతోంది. ప్రశ్నించే ఆదివాసీలు అమాయ కులు కావడం.... మావోయిస్టుల బూచి చూపి ఏజెన్సీలో రూ.కోట్ల విలువైన నిర్మా ణ పనులు నాసిరకంగా సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 

నాసిరకం పనులు....అధికారుల అండదండలు!

చింతగుప్ప వద్దతనిఖీల్లో దొరక్కుండా జాగ్రత్తపడిన వైనం సుమారు రూ. ఆరు కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో వంతెన ని ర్మాణం, ఆప్రోచ్‌ రోడ్డును నిర్మించారు. ఏడాదిన్నరలో వంతెన నిర్మాణం పూర్తవగా, నెల క్రితం అప్రోచ్‌ రోడ్డును నిర్మించారు. రెండు చోట్ల సుమారు పదడుగుల పొడవునా రహదారి బీటలిచ్చిన విషయమై ఈనెల 1న చింతగుప్ప వంతెన వద్ద నెలకే బీటలిచ్చిన బీటీ అప్రోచ్‌ రోడ్డు అనే ఆంద్రజ్యోతి కధనం వెలువడింది. దీన్ని సరిచేయాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు కాంట్రాక్టరుకు అనుకూలంగా వ్యవహ రిస్తూ ఇదేంటని ప్రశ్నించిన స్థానిక ఆదివాసీలకు దాటవేత ధోరణిలో సమాధానం చెప్పడం పలు అనుమానాలు దారితీస్తోంది. కన్సాలిడేషన్‌, క్యూరింగ్‌ సక్రమంగా చేయకుండా హడావుడిగా బీటీ వేయడంతో రహదారి కుంగి బీటలు వారినట్లు కన్పిస్తోంది.

రహదారి పగుళ్లను ఇసుకతో కప్పిన కాంట్రాక్టర్‌

శనివారం ఆర్‌అండ్‌బీ అడ్మినిస్ట్రేషన్‌, నాణ్యతా విభాగం సీఈ సతీష్‌ చింతగుప్ప వంతెన, అప్రోచ్‌ రోడ్డుతోపాటు సుజ్ఞానపురం రహదారి పనులను పరిశీలించారు. తనిఖీల విషయం ముందుగా తెలుసుకున్న కాంట్రాక్టర్‌ బీటలిచ్చిన బీటీ రహదారి పగుళ్లు పైకి కనబడకుండా ఇసుకతో నింపడం గమనార్హం. ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని గమనించకపోవడం విడ్డూరంగా కనబడుతోంది. నిర్మాణం అనంతరం ఐదేళ్ల నిర్వాహణ నిబంధన అడ్డుపెట్టుకొని కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడం, అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఎస్‌ఈ, సీఈ లకు కనబడకపోయినా, స్థానికంగా పనులు పర్యవేక్షించే అధికారులకు సైతం ర హదారిపై పగుళ్లు కనబడక పోవడం, మరమ్మతులకు దిగకపోవడం ఆశ్చర్యకరం గా కన్పిస్తోంది.

ఈఈ ఏమంటున్నారంటే:

నిర్మించిన నెలకే బీటీ రహదారిపై పగుళ్లు రావడాన్ని ఆంద్రజ్యోతి ఈఈ భీమ్లానా యక్‌ దృష్టికి తీసుకె ళ్లగా, ఐదేళ్ల నిర్వహణ నిబంధన ఉందన్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే కాంట్రాక్టర్‌దే పూర్తి బాధ్యతన్నారు. పగుళ్లిచ్చిన చోట మళ్లీ రహదారి నిర్మిస్తామన్నారు. ఐతే ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని కాం ట్రాక్టర్లు ఇష్టారీతిలో పనులు చేయడం, పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

నిర్మాణ పనులను పరిశీలించిన సీఈ

మండలంలో రూ. ఆరు కోట్లతో నిర్మించిన చింతగుప్ప వంతెన, అప్రోచ్‌రోడ్‌ పను లతో పాటు రూ11.50కోట్లతో చేపట్టిన పెదనల్లబల్లి-సుజ్ఞానపురం ఇరవై కిలో మీట ర్ల రహదారి నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ నిర్వహణ, నాణ్యతా విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సతీష్‌ శనివారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఈఈ భీమ్లానాయక్‌ నుంచి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈ హరిలా ల్‌తో పాటు, ఏఈ రాంబాబు ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ని ర్వహించారు. సీఈ పర్యటనను ఆద్యంతం ఆర్‌అండ్‌బీ అధికారులు గోప్యంగా ఉంచారు.


Updated Date - 2022-07-03T05:12:32+05:30 IST