స్థానికులే రోడ్డుకు మరమ్మతు చేశారు

ABN , First Publish Date - 2020-11-30T05:00:36+05:30 IST

జాతీయ రహదారిపై గొయ్యి పడింది. పట్టించుకునే వారు లేరు. స్థానికులే గోతిని పూడ్చి ప్రమాదాలు నివారించారు.

స్థానికులే రోడ్డుకు మరమ్మతు చేశారు
రహదారిపై గోతిని కాంక్రీట్‌తో పూడ్చుతున్న స్థానికులు

వీరవాసరం, నవంబరు 29: జాతీయ రహదారిపై గొయ్యి పడింది. పట్టించుకునే వారు లేరు. స్థానికులే గోతిని పూడ్చి ప్రమాదాలు నివారించారు. వీరవాసరంలో జాతీయ రహదారిపై పెద్ద గొయ్యి ప్రమాదకరంగా మారింది. వర్షం వస్తే నీటితో నిండిన గోతిలో పడిన వాహనదారులు గాయపడుతున్నారు. ప్రమాదాన్ని సూచిస్తూ స్థానికులు డబ్బాలు, ఎర్రజెండాలు ఏర్పాటుచేశారు. ఆరు నెలలుగా గొయ్యి ఎందరినో ప్రమాదంలో పడేసింది. మాజీ వీఆర్వో మద్దాల ఫణీంద్రకుమార్‌ (బాబ్జి) ఆధ్వ ర్యంలో ఆదివారం గోతిలో కాంక్రీట్‌ వేయించి పూడ్పించారు. సమీపంలో ఒక భవన నిర్మాణం వద్ద నుంచి కాంక్రీట్‌ను తీసుకువచ్చి కూలీలతో పనులు చేయించారు.

Updated Date - 2020-11-30T05:00:36+05:30 IST