రోడ్డు ప్రమాదాల నివారణపై వినూత్న ప్రచారం

ABN , First Publish Date - 2021-03-01T04:16:26+05:30 IST

63వ నెంబరు జాతీయ రహదారిపై కోటపల్లి మం డలంలో రోడ్డు ప్రమా దాలు ఎక్కువగా జరుగుతు న్నాయి.

రోడ్డు ప్రమాదాల నివారణపై వినూత్న ప్రచారం
పోలీసులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీ

కోటపల్లి, ఫిబ్రవరి 28 :  63వ నెంబరు జాతీయ రహదారిపై కోటపల్లి మం డలంలో రోడ్డు ప్రమా దాలు ఎక్కువగా జరుగుతు న్నాయి. ప్రమాదాల నివార ణపై దృష్టి పెట్టిన పోలీసు లు ప్రచార బోర్డులు ఏర్పా టు చేశారు. చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనల ఫోటోలు, మృతులు, క్షతగాత్రుల ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేయించి ఆలోచించు నాన్న అనాథలను చేయకు మమ్మల్ని, మద్యం మత్తులో సవారీ- నీ బతుకు గోదారి, మీరొస్తానంటే మేం వద్దంటామా అనే క్యాప్షన్‌లతో ఫ్లేక్సీలు ఏర్పాటుచేశారు.

Updated Date - 2021-03-01T04:16:26+05:30 IST