జిల్లాల్లో రోడ్డు భద్రత కమిటీలు

ABN , First Publish Date - 2021-04-23T10:53:25+05:30 IST

జిల్లాల్లో సీనియర్‌ లోక్‌సభ సభ్యులు చైర్మన్‌గా రహదారి భద్రత( రోడ్‌ సేప్టీ) కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

జిల్లాల్లో రోడ్డు భద్రత కమిటీలు

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో సీనియర్‌ లోక్‌సభ సభ్యులు చైర్మన్‌గా రహదారి భద్రత( రోడ్‌ సేప్టీ) కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  కమిటీకి జిల్లా కలెక్టర్లు వైస్‌చైర్మన్‌గా ఉంటారు. మొత్తం 17 మంది సభ్యులుండే ఈ కమిటీకి రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారని రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వు(జీవో-9)లో పేర్కొన్నారు. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడంలో భాగంగా కమిటీలను పునర్‌వ్యవస్థీకరించారు.


ఇంతకు ముందున్న జిల్లా కమిటీల స్థానంలో ఎంపీ రోడ్‌సేఫ్టీ కమిటీగా పేరు మార్చారు. జిల్లాకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎస్పీ, మున్సిపల్‌ చైర్మన్‌ లేదా మేయర్‌, ఆర్‌డీవో, ముగ్గురు ఎన్‌జీవోలు, ముగ్గురు జిల్లా స్థాయి అధికారులు, వ్యాపారవర్గాల ప్రతినిధి, జిల్లా సివిల్‌ సర్జన్‌, జిల్లా విద్యాశాఖాధికారి, పబ్లిక్‌వర్క్‌ విభాగం సీనియర్‌ అధికారి, జాతీయ రహదారుల విభాగం సీనియర్‌ అధికారి లేదా ఇన్‌చార్జి, ప్రజా పనుల విభాగం అధికారి, జిల్లాలో ఎన్‌హెచ్‌ఏఐ విభాగం ఇన్‌చార్జి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ లేదా రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు.  

Updated Date - 2021-04-23T10:53:25+05:30 IST