Advertisement

గతుకుల రోడ్లు

Oct 29 2020 @ 01:58AM

ఏళ్లు గడిచినా మరమ్మతులు శూన్యం

కళ తప్పిన నైజాం రహదారులు

వీఐపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రయాణించినా మరమ్మతులు లేని వైనం

నిజాంసాగర్‌లోని వీఐపీ రహదారుల దుస్థితి


నిజాంసాగర్‌, అక్టోబరు 28: నిజాంసాగర్‌ వీఐపీ రహదారులంటేనే భయం.. భయం.. నిజాంసాగర్‌ రహదారుల వెంట ప్రయాణించాలంటే భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారులు ఆనాడు ఎంతో సుందరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ రహదారులు అధ్వాన స్థితికి చేరి కళాహీనంగా మారాయి. ఉమ్మ డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారులైన మాసాన్‌పల్లి నుంచి నిజాంసాగర్‌ వరకు, నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి విఘ్నేశ్వరుని ఆలయం వరకు, సుల్తాన్‌నగర్‌ నుంచి గుల్‌గస్త్‌ బంగ్లా వరకు దాదాపు 16కిలో మీటర్ల రహదారిని 1923లోనే నైజాం హయాంలో నిర్మాణం చేశారు. కాల క్రమే ణా ఈ రహదారులను నీటి పారుదల శాఖాధికారులు మరమ్మతులు చేపట్టలేక పోవడంతో రహదారులు గుంతలమయం అయ్యాయి. సుల్తాన్‌నగర్‌ నుంచి గుల్‌గస్త్‌ వరకు ఉన్న రహదారి గుంతల మయం కావడంతో ఈ రహదారి గుండా వెళ్లే పర్యాటకులు అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.


నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి మాసాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు వరకు దాదాపు 10కిలో మీటర్ల రహదారిలో ఐదు కిలో మీటర్ల రహదారి అధ్వానంగా మారింది. నాగ మడుగు కాజ్‌వే వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాగమడుగులో వంతెన నిర్మాణం చేపడతామని ప్రజా ప్రతినిధులు హామీ లిస్తున్నా కలగానే మిగిలిపోయింది. ఏళ్లు గడుస్తున్నా ఈ రహదారికి మరమ్మతులు చేయాలనే కనీస ఆలోచన లేకపోవడం విశేషం.


ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా నిజాంసాగర్‌ రహదారులపై నిర్లక్ష్య వైఖరి అవలంభించడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నిజా ంసాగర్‌ ప్రాజెక్టు గత నాలుగేళ్ల విరామం తర్వాత నిండుజలాలతో కళకళలాడు తుండటంతో ఈ నీటిని ఆస్వాదించ డానికి పర్యాటకులు తండోప తండా లుగా అధ్వానస్థితిలో ఉన్న రహ దారులపై నుంచి వస్తూనే ఉన్నా రు. అధికారులు, ప్రజా ప్రతి నిధులు స్పందించి రహదారు లను మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow Us on:
Advertisement