రహదారులే కల్లాలు!

ABN , First Publish Date - 2020-10-11T10:02:08+05:30 IST

ఖరీఫ్‌లో వేసిన పంట చేతికొచ్చింది. దీంతో రహదారులపై రైతులు పంటలను ఆరబోయడంతో కల్లాలను తలపిస్తు ..

రహదారులే కల్లాలు!

ప్రధాన రహదారులపై మొక్కజొన్న ధాన్యం ఆరబోత 

వాహనాల రాకపోకలకు ఇబ్బందులు 

పట్టించుకోని అధికారులు


వేల్పూర్‌, అక్టోబరు 10: ఖరీఫ్‌లో వేసిన పంట చేతికొచ్చింది. దీంతో రహదారులపై రైతులు పంటలను ఆరబోయడంతో కల్లాలను తలపిస్తు న్నాయి. వేల్పూర్‌ మండలంలోని వివిధ గ్రామాల రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని జాతీయరహదారులతోపాటు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారులపై ఎండబెడుతున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందుల కు గురవుతున్నారు. మండలంలోని 63వ జాతీయ రహదారి అంక్సాపూ ర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి కుకునూర్‌ రోడ్డు వరకూ, వేల్పూర్‌ నుంచి సాహె బ్‌పేట్‌ గ్రామం వరకు, గోవింద్‌పేట్‌ నుంచి జాన్కంపేట్‌ మీదుగా, ప చ్చలనడ్కుడ, చేంగల్‌ రోడ్డు వరకు ఉన్న రోడ్లపై మక్కలను ఆరోబసా రు. పంటలను ఎండబెట్టడంతో వచ్చి పోయే వాహనదారులకు పలు ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు జరుగు తున్నాయి.


మొక్కజొన్న ఆరబెట్టిన రోడ్ల మీదుగా వెళ్లిన ద్విచక్ర వాహన దారులు అదుపుతప్పి పడిపోయి గాయాలపాలైన సంఘటనలు ఉన్నా యి. రోడ్డు ప్రమాదాలకు ఆనవాలుగా మారిన మొక్కజొన్న ధాన్యం ఆర బెట్టిన రోడ్లపై కల్లాలను తొలగించే విధంగా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. ధాన్యం ఆరబెట్టడంతో రోడ్లపై ఓ వైపు నుంచి వాహనం వస్తుంటే మరో వైపు నుంచి ఎదురు గా వాహనం వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. 63వ జాతీయరహదారి పడిగెల గేట్‌ నుంచి పడిగెల గ్రామం వరకు మొక్కజొన్న ధాన్యం ఆరబె ట్టడానికి రహదారులపైనే కల్లాలను రైతులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రయాణానికి అసౌకర్యం ఏర్పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని బీటీ రోడ్లపై పూర్తిగా మొక్కజొన్న ఆరబెట్టడం వల్ల రోడ్లు లేకపోవడం తో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై ఎండ బోసిన ధాన్యం ధూరంగా చెల్లచెదురై చిల్లకుండా ఉండేందుకు కల్లాల చుట్టూ పెద్ద రాళ్లు, కర్ర మొద్దులు, ఎడ్లబండి చక్రాలను అడ్డుగా పెడు తున్నారు. దీంతో రాత్రిపూట అవి కనపడకపోవడంతో రోడ్డు ప్రమాదా లు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకో కపోవడం లేదు. సంబంధిత శాఖ అధికారులు జోక్యం చేసుకొని వెంట నే ధాన్యం ఆరబెట్టుకునే విధానాన్ని నిషేదించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-11T10:02:08+05:30 IST