డ్రెయినేజీలను తలపిస్తున్న అంతర్గత రోడ్లు

ABN , First Publish Date - 2022-08-11T05:50:54+05:30 IST

కలిదిం డిలో పలు అంతర్గత రహదారులు డ్రెయినేజీలను తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు.

డ్రెయినేజీలను తలపిస్తున్న అంతర్గత రోడ్లు
రహదారిని పరిశీలిస్తున్న జయమంగళ

కలిదిండి, ఆగస్టు 10 : కలిదిం డిలో పలు అంతర్గత రహదారులు డ్రెయినేజీలను తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు. బుధవా రం కలిదిండి 4వ వార్డులో బురదకయ్యలుగా ఉన్న అంతర్గత రహదారులను ఆయన పరిశీలించి మాట్లాడారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో అంతర్గత రహదారులు బురదకయ్యలుగా మారుతున్నాయన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని పంచాయతీ అధికారులను డిమాండ్‌ చేశారు. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద అధికంగా ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వెంటనే ఖాళీ ప్రదేశాల్లోని వర్షపు నీరు తొలగించాలన్నారు. తెలుగు రైతు అధ్యక్షుడు మేకా భోగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ లంకా రత్నారావు, ఎం.డి.ఉమర్‌, అబ్దుల్‌ అస్లాం పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:50:54+05:30 IST