చినుకు పడితే చెరువులే..!

ABN , First Publish Date - 2022-08-10T05:24:03+05:30 IST

గోతులు పడిన రహదారులు వర్షం కురిస్తే చెరువులు, కాల్వలను తలపిస్తున్నాయి.

చినుకు పడితే చెరువులే..!
పెద్ద పెద్ద గోతులతో ఆకివీడు–సిద్ధాపురం రోడ్డు

ఆకివీడు/ఉండి, ఆగస్టు 9: గోతులు పడిన రహదారులు వర్షం కురిస్తే చెరువులు, కాల్వలను తలపిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆకివీడు పట్టణంలో రహదారులు అధ్వానంగా మారాయి. సిద్ధాపురం, సమతానగర్‌ రహదారులతో పాటు మినీ భైపాస్‌ రోడ్‌ పెద్ద పెద్ద గోతులతో ఉన్నాయి. శాంతినగర్‌, అమృతరావునగర్‌, శ్రీరామపురం తదితర లోత ట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణంలోని ప్రధాన డ్రెయిన్లు, గంగానమ్మ, మూలలంక బోదె ఆక్రమణలతో నీరు వెళ్లే మార్గం లేక చిన్నపాటి వర్షానికి రహదారులు మునుగుతున్నాయి. పాలకవర్గం, అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.


ఉండి మండలంలో అధ్వాన రహదారులు వర్షాలతో ప్రమాదకరంగా మారాయి. ఉండిలోని కాపులపేట, కోండ్రుతుపేట, సంతమార్కెట్‌ రహదా రులపై వర్షపు నీరు చేరింది. యండగండి, చిలుకూరు రహదార్లు అస్తవ్యస్తంగా మారాయి. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లినా ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు.

Updated Date - 2022-08-10T05:24:03+05:30 IST