అధ్వానదారులు

ABN , First Publish Date - 2022-10-02T05:00:36+05:30 IST

పల్లెల్లో రహదారులు నానాటికీ దీనావస్థకు చేరుకుంటున్నాయి. పేరుకే దారులు ఉన్నా అవన్నీ గుంతలమయమై రోడ్డు ప్రమాదాలకు కేరా్‌ఫగా నిలుస్తున్నాయి.

అధ్వానదారులు

తాడిమర్రి, అక్టోబరు 1: పల్లెల్లో రహదారులు నానాటికీ దీనావస్థకు చేరుకుంటున్నాయి. పేరుకే దారులు ఉన్నా అవన్నీ గుంతలమయమై రోడ్డు ప్రమాదాలకు కేరా్‌ఫగా నిలుస్తున్నాయి. తాడిమర్రి మండల కేంద్రానికి చేరుకోవాలంటే పలు గ్రామాల ప్రజలు సాహసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మండలంలోని అగ్రహారం, శివంపల్లి గ్రామాల నుండి వచ్చే రోడ్లు  మినహా మిగతా రోడ్లన్నీ అధ్వానస్థితికి చేరుకున్నాయి. తాడిమర్రి నుంచి దాడితోట వరకు ఉన్న రోడ్డు ఘోరంగా తయారైంది. కేవలం 18 కిలోమీటర్ల రోడ్డులో ప్రయాణించాలంటే దాదాపు 50 నిమిషాలు సమయం పడుతోంది. పులివెందులకు రాకపోకలు నరకాన్ని తలపిస్తున్నాయి. మరికొందరైతే చిల్లకొండయ్యపల్లి మీదుగా కునుకుంట్లకు వెళ్లి అక్కడి నుంచి తాడిమర్రికి చేరుకుంటున్నారు. ఇక నిడిగల్లు రోడ్డుకు రెండు నెలల క్రితం మరమ్మతులు చేసినా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. తాడిమర్రి నుంచి నారసింపల్లి మీదుగా బత్తలపల్లికి వెళ్లేవారు రూటుమార్చి కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోంది. 



Updated Date - 2022-10-02T05:00:36+05:30 IST