వరదలకు దెబ్బతిన్న రోడ్లకు మోక్షమెప్పుడు?

ABN , First Publish Date - 2021-12-22T03:58:38+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ముంపునకు రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి.

వరదలకు దెబ్బతిన్న రోడ్లకు మోక్షమెప్పుడు?
గంగపట్నం వద్ద వరదలకు తెగిన రోడ్డు

నెల రోజులు దాటినా పట్టించుకోని అధికారులు

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, రైతులు


ఇందుకూరుపేట, డిసెంబరు 21 : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ముంపునకు రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. నెలరోజులు దాటినా దెబ్బతిన్న రోడ్లకు ఆర్‌అండ్‌బీ అధికారులు గంపెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. వరదలకు అనేకచోట్ల రహదారులు దెబ్బతిని, ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితి ఇప్పటికీ మండలంలో కనిపిస్తుంది. ప్రధానంగా ముదివర్తిపాళెం-నిడిముసలి మధ్య తెగిపోయిన రోడ్డు పునర్నిర్మాణానికి నోచుకోలేదు. కాగా తీరగ్రామాలైన కొరుటూరు, రాముడుపాళెం, గంగపట్నం, లేబూరు, పున్నూరు. కొమరిక రోడ్లు, పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. ప్రయాణాలకు ఏ మాత్రం అనువుగా లేకున్నా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. దీంతో విద్యార్థులు, కూరగాయల రైతులు అవస్థలు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.







Updated Date - 2021-12-22T03:58:38+05:30 IST