rain:నీట మునిగిన బెంగళూరు...ప్రయాణికులు ట్రాక్టర్లలో ఎయిర్‌పోర్టుకు...

ABN , First Publish Date - 2021-10-12T16:34:40+05:30 IST

భారీవర్షాల వల్ల బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారులు జలమయమయ్యాయి...

rain:నీట మునిగిన బెంగళూరు...ప్రయాణికులు ట్రాక్టర్లలో ఎయిర్‌పోర్టుకు...

బెంగళూరు : భారీవర్షాల వల్ల బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారులు జలమయమయ్యాయి.వందలాది టాక్సీలు, ప్రైవేట్ వాహనాలు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో చిక్కుకుపోయాయి.దీంతో ప్రయాణికులు టెర్మినల్స్‌లోకి ప్రవేశించలేకపోతున్నారు. ఎలాంటి మార్గం లేకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి ట్రాక్టర్ రైడ్ చేయాల్సి వచ్చింది. విమానాశ్రయానికి విమాన ప్రయాణికులు ట్రాక్టర్లపై వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఐటీ హబ్‌లోని కోనప్పన అగ్రహార పరిసరాల్లోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.బెంగళూరులో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురవవచ్చని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.కర్ణాటకలో తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగళూరులో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Updated Date - 2021-10-12T16:34:40+05:30 IST