సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు
కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన సీఐటీయూ నాయకులు
కాగజ్‌నగర్, జనవరి 28: పట్టణంలోని రోడ్లను విస్తరించాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజుకు శుక్రవారం సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో రోడ్ల విస్తరణ లేకపోవడంతో అంతా ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు రోడ్లపై పూర్తిగా గుంతలు పడ్డాయని తెలిపారు. త్వరలోనే వీటికి మరమ్మతులు చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్ కుమార్, తదితరులున్నారు.