Advertisement

దారులూ ధ్వంసం

Oct 16 2020 @ 01:48AM

వరుస వర్షాలతో అధ్వానంగా రహదారులు 

కామారెడ్డి జిల్లాలో 140 కి.మీ. మేర దెబ్బతిన్న రోడ్లు 

పలుచోట్ల కొట్టుకుపోయిన వంతెనలు 

19వేల ఎకరాల్లో నీటమునిగిన పంటలు 

పాక్షికంగా కూలిపోయిన 121 ఇళ్లు 

పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

10కోట్ల రూపాయలకు పైనే ఆస్తినష్టం 


కామారెడ్డి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) :

కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షా లు అపార నష్టాన్ని కలిగించాయి. పంటల పైనే కాదు.. రహదారులపైనా తీవ్ర ప్రభా వాన్ని చూపించాయి. జిల్లావ్యాప్తంగా 140 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయం టే.. వర్ష బీభత్సం ఎలా ఉందో ఊహిం చుకోవచ్చు. పలుచోట్ల వంతెనలూ కొ ట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు ఆయా గ్రామాల్లోని 121 ఇళ్లు సైతం పాక్షికంగా దెబ్బతి న్నాయి. మొత్తమ్మీద జిల్లా వ్యా ప్తంగా రూ.10 కోట్లకు పైగా నే ఆస్తి నష్టం వాటిల్లిన ట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 


రహదారులు.. ఇళ్లు వర్షార్పణం! 

జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ర హదారులు, ఇళ్లు గతంలో ఎన్నడూ లేని విధం గా దెబ్బతిన్నాయి. సుమారు 140 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినడంతో కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. ప్రధానంగా జుక్కల్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధి లో వరుస వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నట్లు ఆర్‌ అండ్‌బీ శాఖ అధికారుల సర్వేలో తే లింది. బా న్సువాడ నుంచి బిచ్కుంద వెళ్లే ప్రఽధానరహదా రి, నిజాంసాగర్‌, పిట్లం రహదారులు, జుక్కల్‌, మద్నూర్‌ ప్రధాన రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. పలు చోట్ల వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు కొనసాగుతుండడంతో పక్కనే వేసిన తాత్కలిక రోడ్లు, వరదల తాకిడికి పలు మార్లు కోట్టుకుపోయాయి. ప్రధాన రహదారు లే కాకుండా గ్రామీణ రహదారులు సైతం వర్షా ల తాకిడికి ధ్వంసమయ్యాయి. జిల్లాలోని 121 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా మూడు భవనా లు పూర్తిగా కూలిపోయినట్లు రెవెన్యూశాఖ గుర్తిం చింది. వీటికి గాను సుమారు రూ.30 లక్షల వ రకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఇక జిల్లాలో ని 40 చెరువులకు గండ్లు పడగా మరికొన్ని చె రువు కట్టలకు బీటలు వారాయి. దీంతో నీటి పారుదలశాఖ అధికారులు తాత్కాలికంగా రూ. 20లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి గండ్ల ను పూడ్చివేశారు. అదేవిధం గా ఈదురుగాలు లకు జిల్లాలో 25వరకు విద్యుత్‌ స్తంభాలు నేల కొరగడం, మరికొన్ని చోట్ల విద్యుత్‌ తీగలు తెగి స్తంభాలు వంగిపోవడంతో కొద్దిమేర నష్టం వా టిల్లినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.  


నిలిచిపోయిన రాకపోకలు

జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కుర వడంతో పిట్లం, బిచ్కుంద, జుక్క ల్‌, నిజాంసాగర్‌ తదితర ప్రాంతాల్లోని మారు మూల గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయా యి. ప్రధానంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు, కౌలా స్‌, పోచారం ప్రాజెక్ట్‌ పూర్తిగా నిండడం, గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతుండ డంతో లోతట్టు ప్రాంతాలు జల మయమవుతు న్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు ని లిచిపోతున్నాయి. పిట్లం మండలంలో కుర్తి బ్రి డ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండ డంతో ఇరుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి.


పంట నష్టం రూ.7కోట్లకు పైనే.. 

భారీ వర్షాలు జిల్లాలోని వ్యవసాయ రంగం పైనా తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లావ్యాప్తం గా 19వేల ఎకరాలకు పైగానే వివిధ పంటలు దెబ్బతినడంతో సుమారు రూ.7 కోట్లకుపైగా రై తులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచ నా వేశారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బా న్సువాడ డివిజన్‌ల పరిధిలో భారీ వర్షాల కార ణంగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. చేతికొ చ్చిన పంటలు వరద నీటితో మునిగిపోగా.. ప లుచోట్ల ధాన్యం తడిసి మొలకెత్తింది. జిల్లా వ్యా ప్తంగా 19,313 ఎకరాలలో వివిధ పంట లు దె బ్బతినగా.. 19,169 మంది రైతులకు రూ.7.25 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధి కారులు అంచనావేశారు. వరి, పత్తి, సోయాబీ న్‌, మొక్కజొన్న, చెరుకు పంటలు తీవ్రంగా దె బ్బతిన్నాయి. జిల్లాలోని 22 మండల్లా 316 గ్రా మాల్లో వరి 9,863 ఎకరాలలో దెబ్బతినగా పత్తి 9,350 ఎకరాలలో, సోయాబీన్‌ 160 ఎకరాలలో, చెరుకు 40 ఎకరాలలో దెబ్బతిన్నది. 

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.