రేషన్ కోసం క్యూలో నిలుచున్న లబ్ధిదారులు
పోరుమామిళ్ల, జనవరి 20 : సర్వర్ మొరాయించడంతో రేషన్ బియ్యం కోసం జనం రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రభుత్వం రెండు నెలలకు సంబంధించి జనవరిలో బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టడంతో లబ్ధిదారులు షాపుల వద్ద గంటల తరబడి సర్వరు పనిచేయక వేచిచూడాల్సి వచ్చింది. సర్వర్ కొద్ది సేపు పని చేయడం, మరి కొద్ది సేపు మొరాయించడంతో కూలీ పనులకు వెళ్లే జనాలు అటు పనులకు వెళ్లలేక ఇటు బియ్యం తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం రంగసముద్రం పంచాయతీ పరిఽధిలోని ఓ రేషన్‌షాపులో సర్వర్ పనిచేయని విషయాన్ని మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతా్‌పరెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు స్పందించి అందరికీ బి య్యం అందేలా చూస్తామని సాంకేతిక లోపం తలెత్తకుండా ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.