ఆమెకు 32 ఏళ్ల వయసు.. ఇప్పటికే 32 పెళ్లిళ్లు.. మరో పెళ్లికి సిద్ధమైంది కానీ ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-05-17T22:27:31+05:30 IST

ఆమె వయసు 32 సంవత్సరాలు.. వరుసబెట్టి పెళ్లిళ్లు చేసుకుని లక్షల రూపాయలు దోచుకొని పరారు అవుతుంటుంది..

ఆమెకు 32 ఏళ్ల వయసు.. ఇప్పటికే 32 పెళ్లిళ్లు.. మరో పెళ్లికి సిద్ధమైంది కానీ ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్..!

ఆమె వయసు 32 సంవత్సరాలు.. వరుసబెట్టి పెళ్లిళ్లు చేసుకుని లక్షల రూపాయలు దోచుకొని పరారు అవుతుంటుంది.. ఇప్పటికే ఎంతో మంది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ఓ పథకం వేశారు.. తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ వ్యక్తిని వరుడిగా ఆమె వద్దకు పంపించారు.. అతనితో ఆమె 33వ పెళ్లికి సిద్ధమైంది.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. 


మధ్యవర్తుల ద్వారా పెళ్లి సెట్ చేసుకోవడం, వివాహం అనంతరం అత్తింటికి వెళ్లి వారికి సంబంధించిన డబ్బు, నగలు దోచుకుని పరారు కావడం, మళ్లీ మరో పెళ్లికి సిద్ధ కావడం.. ఇదీ రాజస్థాన్‌లోని దుంగార్పూర్‌కు చెందిన 32 ఏళ్ల రీనా ఠాకూర్ అలియాస్ కాజల్ చరిత్ర. ఇప్పటికి ఇలా ఆమె 32 పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె చేతిలో మోసపోయిన ఎంతో మంది వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత ప్రయత్నించినా రీనా ఆచూకీ పోలీసులకు చిక్కలేదు. దీంతో వారు ఓ పథకం వేశారు. 


తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ వ్యక్తిని వరుడిగా రీనా వద్దకు పంపించారు. ఆమె అతడితో పెళ్లికి అంగీకరించింది. 33వ పెళ్లికి సిద్ధమవుతున్న రీనాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెతో పాటు ఆమె గ్యాంగ్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరినీ విచారిస్తున్నారు. 

Updated Date - 2022-05-17T22:27:31+05:30 IST