ప్రియుడిని జైలు నుంచి విడిపించేందుకు అప్పు చేసిన యువతి.. అప్పులు తీర్చేందుకు ఆ ప్రియుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-11T08:34:46+05:30 IST

ఆ యువకుడు దొంగతనాలు చేసి జైలు కెళ్లాడు. అతడిని విడిపించేందుకు బెయిల్ కోసం అతని ప్రియురాలు భారీ వడ్డీపై అప్పు చేసింది. బెయిలు బయటికొచ్చిన ప్రియుడు అప్పు తీర్చేందుకు మళ్లీ దొంగతనాలు చేశాడు. ఇలా పలుమార్లు జరిగింది. తాజాగా నగరంలో దొంగతనాలు ఎక్కువ...

ప్రియుడిని జైలు నుంచి విడిపించేందుకు అప్పు చేసిన యువతి.. అప్పులు తీర్చేందుకు ఆ ప్రియుడు ఏం చేశాడంటే..

ఆ యువకుడు దొంగతనాలు చేసి జైలు కెళ్లాడు. అతడిని విడిపించేందుకు బెయిల్ కోసం అతని ప్రియురాలు భారీ వడ్డీపై అప్పు చేసింది. బెయిలు బయటికొచ్చిన ప్రియుడు అప్పు తీర్చేందుకు మళ్లీ దొంగతనాలు చేశాడు. ఇలా పలుమార్లు జరిగింది. తాజాగా నగరంలో దొంగతనాలు ఎక్కువ కావడంతో పోలీసులు అతడిని పట్టుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరంలో ఇటీవల ఖరీదైన మొబైల్ దొంగతనాల కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారని తెలుసుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అప్పుడు వారు పాత నేరస్తుల జాబితాను పరిశీలించగా.. ఇటీవలే ఒక దొంగ బెయిలుపై విడుదలైనట్లు తెలిసింది.

అతనే విశాల్ ననేరియా(22). పోలీసులు ఎంతో చాకచక్యంగా విశాల్‌ని పట్టుకున్నారు. 


దొంగతనాల చేసి పలుమార్లు జైలు కెళ్లి మళ్లీ బెయిల్ పై ఎలా వస్తున్నాడని పోలీసులు ఆరాతీశారు. అప్పడు విశాల్ చెప్పింది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. విశాల్ దొంగతనాలు చేసి పట్టుబడిన ప్రతిసారి అతని ప్రియురాలు వెంటనే అతడిని విడిపించేందుకు పోలీసుల వద్దకు వచ్చేది. అతడిని క్షమించి వదిలివేయమని అడిగేది. ఇకపై విశాల్ నేరాలు చేయడని హామీ ఇచ్చేది. ఆ తరువాత అతడిని విడిపించేందుకు బెయిలుకు కావాల్సిన డబ్బులు అప్పు చేసి మరీ తెచ్చేది. ఆ అప్పులు తీర్చేందుకు విశాల్ మళ్లీ దొంగతనాలు చేసేవాడు. పోలీసులకు దొరికితే మళ్లీ అతని ప్రియురాలు రక్షించేది. ఇప్పటికే విశాల్‌పై పలు పోలీస్ స్టేషన్లలో 8కి పైగా దొంగతనాల కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2022-04-11T08:34:46+05:30 IST