దోపిడీ దొంగ బొమ్మతో Modiకి వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-07-02T18:24:26+05:30 IST

ప్రధాని మోదీ(PM Modi)కి వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. పలు చోట్ల ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని..

దోపిడీ దొంగ బొమ్మతో Modiకి వినూత్న నిరసన

Rangareddy : ప్రధాని మోదీ(PM Modi)కి వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. పలు చోట్ల ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని ఫ్లెక్సీలు వెలియగా.. నేడు మరింత వినూత్నంగా ప్రధానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వనస్థలిపురంలోని పెట్రోల్ బంక్(Petrol Bunk), బ్యాంకుల(Banks) ముందు వినూత్న ఒక దోపిడీ దొంగ వేషంలో ఒక వ్యక్తి ప్లకార్డుతో దర్శనమిస్తున్నారు. ఆ ప్లకార్డులో ‘మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటే.. నువ్వు ఏకంగా దేశాన్నే దోచేశావు... బై బై మోదీ’ అని రాసి ఉంది. వీటిని జనం చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. 


ఇక అంతకు ముందు ఫ్లెక్సీల్లో చేపట్టిన పలు కార్యక్రమాలను గురించి ప్రస్తావించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, రైతు చట్టాలు, నోట్ల రద్దు ఇలా పలు అంశాలను ప్రస్తావించారు. ‘రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్‌, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్‌, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావు, హఠాత్తుగా లాక్‌డౌన్‌ అని సామాన్యులను చంపినవ్‌, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాలో వేస్తానన్న 15 లక్షలు ఏవి, నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్‌’ అని ప్లెక్సీల్లో పేర్కొన్నారు.













Updated Date - 2022-07-02T18:24:26+05:30 IST