తెలంగాణను దోచుకుంటున్నారు

Published: Mon, 28 Mar 2022 00:19:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలంగాణను దోచుకుంటున్నారుమాట్లాడుతున్న ఎంపీ సోయం బాపురావు

బీజేపీ నాయకుల సమావేశంలో ఎంపీ సోయం బాపురావు
ఉట్నూర్‌, మార్చి 27: తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామంటూ ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఎంపీ సోయం బాపు రావు ఆరోపించారు. ఆదివారం  స్థానిక గిరిజన భవన్‌లో నిర్వహించిన ఖానాపూర్‌ నియోజకవర్గం బీజేపీ నాయకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు నాయకులు రాష్ట్రాన్ని దో చుకుంటున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని బావిస్తున్న సీఎం కేసీఆర్‌ బీజేపీపై విమర్శలు చేస్తూ కాలం గడిపేస్తున్నార ని అన్నారు. లక్షలాది కోట్ల రూపాయలు మింగి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. కేంద్రం పంపిస్తున్న నిధులతో డాబులు చేస్తూ కేంద్రాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. అందుకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయించాలని కేంద్రం  భావించిందన్నారు. గ్రామాలలో నిర్మించిన రైతు వేదిక భవనాలు కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించి రాష్ట్రం పేరు చెప్పుకుంటున్నారని అన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ గ్రామ స్థాయిలో బీజేపీ నాయకులు ప్రజలకు అండ గా ఉంటూ ధర్నాలు చేయాలని, తద్వారా ప్రజలు ప్రభుత్వ పనితీరును ఆలోచిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నా రు. మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ మాట్లాడుతూ ఖానాపూర్‌ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినందున కార్యకర్త లు, నాయకులు పార్టీని కాపాడుకోవడానికి ప్రజల్లో ఉండాలన్నారు. ఉత్తర భారతదేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో  బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజ యం సాధించిందని, ప్రధాన మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరుస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర  ఆశయం నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇందులో పార్టీ జిల్లా ఇన్‌చార్జి అల్జాపూర్‌ శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌, జిల్లా అధికార ప్రతినిధి కడమండ్ల రాజమణి, పెంబి జడ్పిటీసీ బుక్యా జానకిరమేష్‌, శ్రీరాంనాయక్‌,  మరప రాజు, కోడేరి రమేష్‌, రాజశేఖర్‌, రాథోడ్‌ రితేష్‌, దేవిదాస్‌, కొమ్మురాంచందర్‌, సాడిగే రాజేశ్వర్‌, బండారి వెంకటేష్‌, సీపతి లింగాగౌడ్‌ తదితరులు పాల్గొనారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.