ఆ మూవీస్ అన్నింటికంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రమిదేనంటా....

Published: Fri, 21 Jan 2022 16:12:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ మూవీస్ అన్నింటికంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రమిదేనంటా....

బ్యాట్‌మ్యాన్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అందుకే ఆ సిరీస్‌లో కొత్త సినిమా ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు ఈ సూపర్ హీరో అభిమానులు. అందుకే కొత్త బ్యాట్‌మ్యాన్ సినిమా ట్రైలర్ విడుదలై కొన్ని గంటల్లోనే వైరల్ చేశారు ఫ్యాన్స్. ఈ చిత్రం గురించి మరో వార్త హల్‌చల్ చేస్తోంది.


తాజాగా వస్తున్న ‘ది బ్యాట్ మ్యాన్: ది బ్యాట్ అండ్ ది క్యాట్’ సినిమాలో రాబర్ట్ ప్యాటిసన్ కొత్త సూపర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్ర నిడివి ఈ సిరీస్‌లోని గత చిత్రాల కంటే ఎక్కువగా ఉండనుందటా. ఇందులోని మొదటి మూడు సినిమాలు ‘ది డార్క్ నైట్ రైజెస్’ నిడివి 2 గంటల 45 నిమిషాలు, ‘ది డార్క్ నైట్’ రన్ టైమ్ 2 గంటల 32 నిమిషాలు, ‘ది బ్యాట్‌మ్యాన్’ లెంత్ 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 


కాగా, నూతన చిత్ర నిడివి దాదాపు 2 గంటల 55 నిమిషాలు అంటే దాదాపు 3 గంటలు ఉందంటా. హాలీవుడ్‌లో ‘జాక్ స్నైడర్స్ జస్టీస్ లీగ్’ 4 గంటల 2 నిమిషాలు, ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ 3 గంటల 1 నిమిషం తర్వాత అతి పెద్ద సినిమా ఇదే. కాగా, ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా..  ఇటీవలే విడుదలైన రెండు ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్‌ని అందుకోని వాటి రెట్టింపు చేశాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International