రోబో తయారు చేసి రికార్డుల్లోకి...!

ABN , First Publish Date - 2021-05-01T05:26:52+05:30 IST

కొవిడ్‌పై పోరాటానికి అందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అనకాపల్లికి చెందిన పదేళ్ల బుడతడు కొవిడ్‌ బారినపడకుండా ఉండడం కోసం కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘శ్రేయాస్‌’ రోబో.

రోబో తయారు చేసి రికార్డుల్లోకి...!

కొవిడ్‌పై పోరాటానికి అందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అనకాపల్లికి చెందిన పదేళ్ల బుడతడు కొవిడ్‌ బారినపడకుండా ఉండడం కోసం కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘శ్రేయాస్‌’ రోబో. 

అనకాపల్లికి చెందిన కంచర్ల శ్రీమహిత్‌రాజ్‌ సరికొత్త రోబోనూ తయారుచేశాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే కొవిడ్‌ బారినపడకుండా  అవసరమైన పనులన్నీ చేసి పెడుతుంది. 

తరగతి గదిని తరచుగా శానిటైజ్‌ చేస్తుంది. కొవిడ్‌ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. 1.34కేజీల బరువున్న ఈ కేరింగ్‌ రోబోకు ‘శ్రేయాస్‌’ అని పేరు పెట్టాడు.

ఎన్‌సిఆర్‌సి 2020 రోబోటిక్‌ కాంపిటీషన్‌లో తన రోబోను ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నాడు. అంతేకాదు శ్రీమహిత్‌ బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఇండియా బుక్‌ ఆఫ్‌ ది రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడీ బాల మేధావి. 

Updated Date - 2021-05-01T05:26:52+05:30 IST