రోబోటిక్స్‌... విజయవాడలో...

Published: Tue, 29 Jun 2021 12:08:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రోబోటిక్స్‌... విజయవాడలో...

సెంట్రల్‌ ఆంరంధలో మొట్టమొదటిసారిగా విజయవాడలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సల కోసం రోబోటిక్స్‌ను ప్రారంభించడం జరిగింది. 


రోబోటిక్స్‌తో కీలు మార్పిడి ఎలా చేస్తారు?

మోకీలు మార్పిడి అనేది సహజంగా మోకాలు కీళ్లు అరిగిపోయిన వారికి చేసే శస్త్రచికిత్స. అయితే రోజు రోజుకి పెరుగుతున్న సాంకేతికతతో మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ రోబోటిక్స్‌ కూడా పేషెంట్‌కి ఇంకా మెరుగైన చికిత్స అందించడం కోసమే తయారైంది. దీని వల్ల శస్త్ర చికిత్సలో చాలా అభివృద్ధి మనం చూడవచ్చు. ఒక సర్జన్‌ రోబోటిక్స్‌ యంత్రం కలిసి చేసే కీలు మార్పిడి ప్రక్రియ ఇది. మానవమాత్రుడైన సర్జన్‌, ఖచ్చితమైన ఆదేశాలనిచ్చే ఒక యంత్రం సహాయంతో చేసే కీలు మార్పిడి ఈ రోబోటిక్‌ కీలుమార్పిడి.


సాధారణ మోకీలు మార్పిడికి, ఈ రోబోటిక్స్‌తో చేసే కీలు మార్పిడికి తేడా ఉందా?

మోకీలు మార్పిడి చేసినపుడు మానవమాత్రుడైన ఒక సర్జన్‌ చేసే శస్త్ర చికిత్సకి, యంత్రం అయిన రోబోటిక్స్‌తో కలిపి శస్త్రచికిత్సకి వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఈ రోబోటిక్స్‌ అనేది ఒక్కసారి మోకీలుని పరిపూర్ణంగా గమనించి, గణన చేసి ఎంత వరకు మోకీలు అరిగింది, ఎంత వరకు కండకోత అవసరం అనేవి ఖచ్చితంగా బేరీజు చేసి సర్జన్‌కి సమాచారం అందిస్తుంది. దీని వల్ల సర్జన్‌ మరింత ఖచ్చితత్వంతో శస్త్ర చికిత్స చేయడానికి వీలవుతుంది.


ఈ రోబోటిక్స్‌ సహాయంతో చేసే కీలుమార్పిడి వల్ల ప్రయోజనాలేమిటి?

మోకాలు వంకర ఎంత వరకు, ఎన్ని డిగ్రీలు ఉందో, ఎంత ఎముక కోత అవసరమో ఖచ్చితంగా తెలియజేస్తుంది. మన కంటికి తెలియని చిన్నచిన్న తప్పిదాలను కూడా రోబో సర్జరీ చేసే సమయంలో ముందే పసిగట్టి, సర్జన్‌ను హెచ్చరిస్తుంది. ఇంప్లాంట్‌ ఖచ్చితంగా అమర్చడానికి కావాల్సిన సలహాలు, సూచనలు, హెచ్చరికలు చేస్తుంది. మనుషులలో తేడాలు ఉన్నట్లుగానే కీళ్ల అమరికల్లో తేడాలను, లోపాలను, సమస్య తీవ్రతను పసిగట్టి ఎక్కువ కండకోత అవసరం లేకుండా ఏ పరిణామంలోని ఇంప్లాంట్‌ను ఎంపిక చేసుకోవాలో కూడా తెలియపరుస్తుంది. ఎముక ఎంత వరకు కట్‌ చేయాలి, చుట్టూ ఉన్న టిష్యూ ఎంత వరకు కట్‌ చేయాలి.. వంటి చిన్న చిన్న విషయాలను కూడా రోబో సమాచారం అందిచగులుగుతుంది. సర్జన్‌ పొరబాటుగా ఒక మిల్లీ మీటర్‌ కూడా ఎక్కువ కట్‌ చేయడానికి ఆస్కారం లేకుండా అవసరం లేని చోట కట్‌ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే మిషన్‌ ఆగిపోతుంది. దీనివల్ల పేషెంట్‌కు శస్త్రచికిత్స తర్వాత నొప్పి తక్కువగా ఉండటం, తక్కువ సమయం ఆసుపత్రిలో ఉండటం, తొందరగా కోలుకోవడంతో పాటు ఇంప్లాంట్‌ మన్నిక ఎక్కువగా ఉండటం జరుగుతుంది.


2 రోబోటిక్స్‌ ఉండే ఏకైక హాస్పిటల్‌ - శ్రీకర హాస్పిటల్స్‌


డాక్టర్‌ అఖిల్‌ దాడి

MS (ortho)

Chief Joint Replacement Surgeon

శ్రీకర హాస్పిటల్స్‌

ఫోన్‌: 772 999 0003-

939 011 4399-

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.