ఎలుకల దెబ్బకు.. జైలు ఖాళీ చేసిన అధికారులు!

ABN , First Publish Date - 2021-06-23T04:06:25+05:30 IST

కంగారూ దేశం ఆస్ట్రేలియాలో ఇటీవల ఎలుకల ప్లేగు ప్రబలిన సంగతి తెలిసిందే. లక్షలాది ఎలుకలు ఎక్కడపడితే అక్కడ కనిపించిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

ఎలుకల దెబ్బకు.. జైలు ఖాళీ చేసిన అధికారులు!

కాన్‌బెర్రా: కంగారూ దేశం ఆస్ట్రేలియాలో ఇటీవల ఎలుకల ప్లేగు ప్రబలిన సంగతి తెలిసిందే. లక్షలాది ఎలుకలు ఎక్కడపడితే అక్కడ కనిపించిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ఒక జైల్లో సీలింగ్‌లో ఉన్న వైరింగును ఎలుకలు కొరికేశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే జైలును ఖాళీ చేయాల్సి వచ్చింది. జైల్లో సీలింగ్ ప్యానెల్స్ బాగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ‘‘గోడల్లో ఉన్న ఖాళీల్లో దూరిన ఎలుకలు సీలింగులో చేరాయి. అక్కడ అవి చచ్చిపోయాయి. వాటి శరీరాలు కుళ్లిపోయి వాసన వస్తున్నట్లు జైలు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2021-06-23T04:06:25+05:30 IST