India Vs Westindies T20: అమెరికాలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ అభిమానానికి రోహిత్ శర్మ ఫిదా.. ఏం చేశాడో వీడియో మీరూ చూడండి

ABN , First Publish Date - 2022-08-07T22:17:10+05:30 IST

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) టీ20 సిరీస్‌ను భారత్ వశమైంది. ఫ్లోరిడాలో శనివారం జరిగిన 4వ మ్యాచ్‌లో అద్భుత విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1

India Vs Westindies T20: అమెరికాలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ అభిమానానికి రోహిత్ శర్మ ఫిదా.. ఏం చేశాడో వీడియో మీరూ చూడండి

ఫ్లోరిడా : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) టీ20 సిరీస్‌ను భారత్ వశమైంది. ఫ్లోరిడాలో (Florida) శనివారం జరిగిన 4వ మ్యాచ్‌లో అద్భుత విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌(Series)ను దక్కించుకుంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్స్ సమష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఎదురునిలవలేకపోయింది. భారత్ గెలుపుని అమెరికా(USA)లోని ప్రవాస భారతీయులు(NRIs) ఆస్వాదించారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్ అక్కడి ఎన్నారైలను విశేషంగా మెప్పించింది. అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అరుదుగా జరుగుతుంటాయి. కాబట్టి చాలా కాలం తర్వాత అక్కడ పర్యటిస్తున్న భారత ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. మైదానంలోని ఇండియన్ ఆటగాళ్లను కేరింతలు కొడుతూ ఉత్సాహపరిచారు. 


రోహిత్ ఫిదా..

మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులను చూసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిదా అయ్యాడు. ఖండంతరాలు దాటినా భారత్ పట్ల ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్న ఎన్నారైలకు  ముగ్దుడయ్యాడు. మ్యాచ్ అనంతరం ఆడియన్స్ స్టాండ్స్‌లో ఎన్నారై క్రికెట్ అభిమానుల వద్దకు వెళ్లి కరచాలనం చేశాడు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎక్కువమంది ఉత్సాహం చూపడంతో అందరి చేతులు తాకుతూ చిన్న పరుగు తీశాడు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) ట్వీట్ చేసింది. ‘‘ అభిమానులు, వారి సపోర్ట్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ ధన్యవాదాలు చెప్పాడు.’’ అని పేర్కొంది. మ్యాచ్ విజయానంతరం ఈ మేరకు అభినందనలు తెలియజేశాడని బీసీసీఐ పేర్కొంది. 


ఇక నాలుగో టీ20 విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన వెస్టిండీస్ చతికిలపడింది. దీంతో 44 పరుగుల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.



Updated Date - 2022-08-07T22:17:10+05:30 IST