టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2022-04-14T22:25:01+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన

టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 10 వేల పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కగిసో రబడ బౌలింగులో సిక్స్ కొట్టి రోహిత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ ఒక్కడే ఈ ఘనత సాధించగా, ఇప్పుడతడి సరసన రోహిత్ చేరాడు. ఓవరాల్‌గా చూసుకుంటే క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ టీ20ల్లో 10 వేల పరుగులు సాధించారు. 

 

టీ20 క్రికెట్‌లో బెస్ట్ హిట్టర్‌లలో ఒకడిగా పేరుగాంచిన రోహిత్.. 2007లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభ ఎడిషన్‌లో ముంబై తరఫున సెంచరీ సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నాలుగు సెంచరీలు సాధించి అత్యధిక శతకాలు సాధించిన రికార్డు కూడా తన పేరున లిఖించుకున్నాడు. మరో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఉమ్మడి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలోనూ రోహిత్ (427) ఉన్నాడు. ఐపీఎల్‌లో 40 అర్ధ సెంచరీలతో 5700 పరుగులు సాధించాడు. 

Updated Date - 2022-04-14T22:25:01+05:30 IST