
ముంబై: వరుస ఓటములతో కుదేలైన ముంబై జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయత్నిస్తున్నాడు. జట్టు తిరిగి పుంజుకునేందుకు అవసరమైన స్ఫూర్తిని ఆటగాళ్లలో రగిలిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూములో సహచరులతో మాట్లాడుతూ తర్వాతి మ్యాచ్లకు సిద్ధం చేస్తున్నాడు. ఓటములకు కుంగిపోవద్దని, గెలిచినా, ఓడినా సమష్టిగానే బాధ్యత తీసుకుందామన్నాడు.
ఓటములకు ఏ ఒక్కరినో నిందించాల్సిన అవసరం లేదని, బాధ్యత అందరిదీ అని చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థులకంటే మనం ముందుండాలని, అందుకు కాస్తంత కసి, పట్టుదల అవసరమన్నాడు. ఇకపై అలానే ఆడాలని, దేనికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. మనల్ని ఓడించిన వారిని తిరిగి ఓడించాలని చెప్పాడు. కీలక సమయాల్లో మరింత మెరుగ్గా ఆడదామని, ఆ తర్వాత ఏం జరిగితే అదే జరుగుతుందని చెబుతూ ఆటగాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు.
ఇవి కూడా చదవండి