స్వాతంత్ర్యోద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-08-09T05:38:49+05:30 IST

దేశ స్వాతంత్య్ర పోరాట ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని, అందులో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌ అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఏ స్టాలిన అన్నారు.

స్వాతంత్ర్యోద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకం
జెండాను ఆవిష్కరిస్తున్న స్టాలిన, గోదా శ్రీరాములు

భువనగిరి టౌన, ఆగస్టు 8:  దేశ స్వాతంత్య్ర పోరాట ఉద్యమంలో  విద్యార్థుల పాత్ర కీలకమైనదని, అందులో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌ అని  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఏ స్టాలిన అన్నారు. సోమవారం భువనగిరిలో ఏఐఎ్‌సఎఫ్‌  జిల్లా 3వ మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 12 ఆగస్టు 1936లో ప్రారంభమైన ఏఐఎ్‌సఎఫ్‌ దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి సామాజిక, విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు చేపడుతూనే ఉన్నదన్నారు. విద్యార్ధులలో సామాజిక స్పృహ నింపడంతో పాటు విద్యలో ప్రోత్సహించడం ఏఐఎ్‌సఎఫ్‌ లక్ష్యమన్నారు.  కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరిట కాషాయీకరణ చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ఉప్పల శాంతికుమార్‌, చిప్పల పల్లి నవీన, ఎం జానీ, ఎండి షమీ ఉల్లాఖాన, బి.సాయిచరణ్‌, డి.మనోహర్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T05:38:49+05:30 IST