ప్రపంచంలోనే తొలి ‘కొవిడ్-19 ఫైవ్‌స్టార్ ఎయిర్ పోర్ట్’..ఎక్కడుందంటే..

ABN , First Publish Date - 2020-09-16T14:05:35+05:30 IST

కరోనా మహమ్మారి ప్రయాణికుల దరి చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రోమ్ ఫుయిమిసీనో ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు లభించింది. విమానప్రయాణ రేగింట్ సంస్థ స్కైట్రాక్స్.. రోమ్ ఎయిర్ పోర్టకు కొవిడ్-19 ఫై స్టార్ ఎయిర్ పోర్టు రేటింగ్‌ను ఇచ్చింది. ఈ గుర్తింపు పొందిన తొలి ఎయిర్ పోర్టు ఇదే కావడం గమనార్హం.

ప్రపంచంలోనే తొలి ‘కొవిడ్-19 ఫైవ్‌స్టార్ ఎయిర్ పోర్ట్’..ఎక్కడుందంటే..

రోమ్: కరోనా మహమ్మారి ప్రయాణికుల దరి చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రోమ్ ఫుయిమిసీనో ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు లభించింది. విమానప్రయాణ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్.. ఈ ఎయిర్ పోర్టుకు కొవిడ్-19 ఫైవ్‌స్టార్ ఎయిర్ పోర్టు రేటింగ్‌ను ఇచ్చింది. ఈ గుర్తింపు పొందిన తొలి ఎయిర్ పోర్టు ఇదే కావడం గమనార్హం.




‘కరోనా ప్రోటోకాల్స్ అమలు చేయడంలో రోమ్ ఫుయిమిసీనో ఎయిర్ పోర్టు అద్భుతంగా పనిచేసింది. కస్టమర్లు, సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం సురక్షితమైన పరిసరాల్ని నెలకొల్పింది. ఎయిర్ పోర్టులోని ముఖ్యమైన ప్రదేశాల్లో..చేతుల శుభ్రత, భౌతిక దూరం నియమాలను పాటించేలా  పటిష్టమైన విధానాలను అమలు చేస్తోంది. అంతే కాకుండా.. ఈ నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగానే రోమ్ ఎయిర్ పోర్టుకు కొవిడ్-19 ఫైవ్‌స్టార్ ఎయిర్ పోర్టుగా గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం’ అని స్కైట్రాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.


కాగా.. ఈ రేటింగ్ లభించడంపై రోమ్ ఫుయిమిసీనో ఎయిర్ పోర్టు సీఈఓ హర్షం వ్యక్తం చేశారు. ఫైవ్‌స్టార్ అవార్డు లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని, కొవిడ్ నిబంధనల అమలు కోసం తాము చేస్తున్న కృషికి ఇది నిదర్శనం అని సీఈఓ వ్యాఖ్యానించారు.


కరోనా వ్యాప్తిని నివారించేందుకు రోమ్ ఎయిర్ పోర్టు పటిష్టమైన చర్యలు చేపట్టిందని స్కైట్రాక్స్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రయాణికులు గుమిగూడే ప్రదేశాలలో పర్యవేక్షణ కోసం ఏకంగా 40 మంది ప్రత్యేక సిబ్బందిని ఎయిర్ పోర్టు యాజమాన్యం నియమించిందని తెలిపింది. అదే సమయంలో.. సిబ్బంది కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేశారంది.



Updated Date - 2020-09-16T14:05:35+05:30 IST