ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్‌ సిద్ధం

ABN , First Publish Date - 2022-02-25T20:03:23+05:30 IST

ఉక్రెయిన్‌ నుంచి భారత ప్రజల తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్‌ సిద్ధం

ఢిల్లీ : ఉక్రెయిన్‌ నుంచి భారత ప్రజల తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది. రొమేనియా, హంగరీ మీదుగా భారత ప్రజలను తరలించాలని భావిస్తోంది. ఈ తరలింపునకు భారత ప్రభుత్వం, హంగరీలోని భారత ఎంబసీ చర్యలు తీసుకుంటున్నాయి. సరిహద్దుకు సమీపంలో ఉండే భారతీయులకు తొలుత అవకాశం లభించనుంది. హంగరీ, రొమేనియా సరిహద్దుకు సమీపంలో ఉండేవారిని కూడా ముందుగా తీసుకురానున్నారు. భారతీయులు ఎంఈఏతో సమన్వయం చేసుకోవాలని భారత ఎంబసీ సూచించింది. సహాయ చర్యల కోసం హంగరీ సరిహద్దు ప్రాంతానికి బృందాలను పంపించనుంది. చాప్‌-జహోని ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్లనున్నాయి. అలాగే రొమేనియా సరిహద్దు పొరుబ్నే-సిరెట్‌ ప్రాంతానికి సైతం సహాయక బృందాలు వెళ్లనున్నాయి.


Updated Date - 2022-02-25T20:03:23+05:30 IST