రోశయ్య సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-12-05T05:29:24+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని మండల కేంద్రంలోని ఆర్యవైశ్యులు అన్నారు.

రోశయ్య సేవలు మరువలేనివి

ఘన నివాళులు అర్పించిన నాయకులు, ఆర్యవైశ్యులు

తాడిమర్రి, డిసెంబరు 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని మండల కేంద్రంలోని ఆర్యవైశ్యులు అన్నారు. స్థానిక వాసవీ కల్యాణమం డపంలో శనివారం రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రోశయ్య మృతితో తెలుగురాష్ట్రాలు ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయారని, తెలుగురాష్ట్రాల చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదే అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు శివ రామయ్య, ప్రసాద్‌, గుండానాగరాజు, రమేశ్‌, గోపాల్‌, మల్లికార్జున, లక్ష్మీనా రాయణ, గంగాధర్‌, వేణుగోపాల్‌,మహేశ్‌ పాల్గొన్నారు.

తలుపుల: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి తీరనిలోటని టీడీపీ, ఆర్య వైశ్య సంఘం నాయకులు అన్నారు.  శనివారం స్థానిక మూడురోడ్ల కూడలిలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ రోశయ్య ఎమ్మెల్యే, ఎంపీ, ఉమ్మడి ఏపీ రాష్ట్ర కాం గ్రెస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్‌గా పనిచేసి, ఆ పదవుల కు వన్నెతెచ్చా రన్నారు. ఆర్థికమంత్రిగా 16 సార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఘనత ఆయ నకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు , టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

కొత్తచెరువు: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి ఎనలే ని కృషిచేస్తూ పార్టీ అభివృద్ధికి  పాటుపడ్డారన్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఉంటూ ఎంతో మంది ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పనిచేశారన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి పేరుప్రతిష్టలు తెచ్చుకున్న  రోశయ్య మృతిచెందడం కాంగ్రెస్‌పార్టీకి తీరని లోటన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 




Updated Date - 2021-12-05T05:29:24+05:30 IST