శ్రీశైలంతో రోశయ్యది విడదీయని బంధం

ABN , First Publish Date - 2021-12-05T04:31:00+05:30 IST

శ్రీశైలం క్షేత్రంతో ఆంధ్రప్రదేశ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు విడదీయరాని బంధం ఉంది.

శ్రీశైలంతో రోశయ్యది విడదీయని బంధం
శ్రీశైలంలో నివాళి


 శ్రీశైలం, డిసెంబరు 4: శ్రీశైలం క్షేత్రంతో ఆంధ్రప్రదేశ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు విడదీయరాని బంధం ఉంది. అనేక సందర్భాల్లో శ్రీశైలానికి విచ్చేసి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించకున్నారు. ఆయన వివిధ హోదాల్లో పని చేసిన సందర్భాల్లో శ్రీశైలానికి విచ్చేసి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. వాసవీ సత్రం ముఖద్వారం ప్రారంభోత్సవంలో   ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో కలిసి ఆర్థిక మంత్రి హోదాలో శ్రీశైలం వచ్చారు. శనివారం రోశయ్య మృతి చెందడంతో స్థానిక వాసవీ సత్రంలో ఆయన చిత్ర పటానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు, సత్రం నిర్వాహకులు పూలమాలలతో నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సత్రం నిర్వాహకులు పాల్గొన్నారు.   

మహానంది: మాజీ సీఎం రోశయ్యతో మహానంది మండల ఆర్యవైశ్యులకు ఎంతో అనుబంధం ఉంది. శనివారం మృతి చెందిన రోశయ్యకు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కేతుపల్లి గోపాలకృష్ణ, మహానంది దేవస్థానం మాజీ ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జున, భూమా గోపాల్‌, రుక్మాంగధరశెట్టి, భూమా కిషోర్‌, మునగనూరి రమే్‌షబాబు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. 2005లో మహానందిలో వాసవి రిసార్ట్‌ వృద్ధాశ్రమ శంకు స్థాపనకు అప్పటి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హోదాలో రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  

రోశయ్య మృతి తీరని లోటు : ఎమ్మెల్సీ

్ఞఅవుకు, డిసెంబరు 4: రాజకీయ ఉద్దండుడు కొణిజేటి రోశయ్య మృతి తీరని లోటని ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి శనివారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశకు ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు గవర్నర్‌గా సేవలందించారన్నారు. సమర్థవంతంగా పలు కీలక పదవులు చేపట్టి పదవులకే వన్నె తెచ్చారన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

‘రోశయ్య సేవలు ఆదర్శప్రాయం’

ఆత్మకూరు, డిసెంబరు 5: ఉమ్మడి ఆంధ్రపదేశ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు ఆదర్శనీయమని ఆర్యవైశ్య సంఘం నాయకులు భీమి శెట్టి కృష్ణమూర్తి, పువ్వాడి భాస్కర్‌, రమేష్‌, మురళీక్రిష్ణ, జక్కా మురళి, సూర్య నారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వాసవీ కళ్యాణ మండపంలో రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు  నాగసాయిబాబా, వేముల రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-05T04:31:00+05:30 IST