AP News: జగన్‌రెడ్డి నిర్లక్ష్య ధోరణిపై గర్జిద్దాం.. నిలదీద్దామంటూ మహిళా సంఘాల పిలుపు

ABN , First Publish Date - 2022-08-09T19:41:21+05:30 IST

మహిళలపై అఘాయిత్యాలపై మంగళవారం విజయవాడలో రౌండ్‌ టేబుల్ సమావేశం జరిగింది.

AP News: జగన్‌రెడ్డి నిర్లక్ష్య ధోరణిపై గర్జిద్దాం.. నిలదీద్దామంటూ మహిళా సంఘాల పిలుపు

విజయవాడ (Vijayawada): మహిళలపై అఘాయిత్యాలపై మంగళవారం విజయవాడలో ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్ సమావేశం (Round Table Meeting) జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ (TDP), జనసేన (Janasena), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), వామపక్ష నేతలు (Leftist leaders), మహిళా సంఘాలు (Women Associations) పాల్గొన్నాయి. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. కలిసికట్టుగా పోరాడాలని అఖిల పక్షాలు నిర్ణయించాయి. జగన్‌రెడ్డి (Jagan reddy) నిర్లక్ష్య ధోరణిపై గర్జిద్దాం.. నిలదీద్దామంటూ మహిళా సంఘాలు పిలుపిచ్చాయి.


తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) మాట్లాడుతూ వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 2వేల మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. తప్పు చేస్తే జగన్‌రెడ్డి ప్రభుత్వంలో.. చర్యలకు బదులు పదోన్నతులు ఇస్తున్నారని విమర్శించారు. ఎంపీ గోరంట్లపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. గోరంట్లపై చర్యలు తీసుకుంటే వైసీపీ ఖాళీ అవుతుందనా?... గోరంట్ల వ్యవహారాన్ని రోజా లాంటి వారు సమర్థించడం దుర్మార్గమన్నారు. ఆనంతబాబు, మాధవ్‌ను పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని అనిత డిమాండ్ చేశారు.

Updated Date - 2022-08-09T19:41:21+05:30 IST