అధికార వికేంద్రీకరణపై రౌండ్‌టేబుల్‌ సమావేశం రేపు

ABN , First Publish Date - 2022-09-24T06:46:23+05:30 IST

అధికార వికేంద్రీకరణపై ఈ నెల 25న ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలె్‌సలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

అధికార వికేంద్రీకరణపై రౌండ్‌టేబుల్‌ సమావేశం రేపు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అమర్‌నాథ్‌

మంత్రి అమర్‌నాథ్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): అధికార వికేంద్రీకరణపై ఈ నెల 25న ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలె్‌సలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. శుక్రవారం నగరంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధికార వికేంద్రీకరణకు సంకల్పించారన్నారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు అన్నీ తానై నడిపిస్తున్న అమరావతి రైతుల పాదయాత్ర ప్రాంతాల మధ్య విభేదాలు రగిల్చే విధంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో వివరించడానికి ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్రకు చెందిన అన్ని వర్గాల పెద్దలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,  జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైసీపీ ఉత్తర ఇన్‌చార్జి కేకే రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T06:46:23+05:30 IST