రౌడీషీటర్‌ అరెస్ట్‌, రిమాండ్‌

ABN , First Publish Date - 2020-07-13T11:14:59+05:30 IST

మండలానికి చెందిన ఓ రౌడీషీటర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు నాంపల్లి సీఐ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

రౌడీషీటర్‌ అరెస్ట్‌, రిమాండ్‌

తల్వార్‌, వేటకొడవలి, కారు స్వాధీనం 


చింతపల్లి, జూలై 12: మండలానికి చెందిన ఓ రౌడీషీటర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు నాంపల్లి సీఐ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన చింతపల్లి ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని తిరుమలపురం గ్రామానికి చెందిన రౌడీషీటర్‌ రాజే్‌షరావు గతంలో పలు అక్రమాలకు పాల్పడి పీడీయాక్టు నమోదు తో జైలుకు వెళ్లాడు. జైలుకెళ్లాక సత్ప్రవర్తనతో ఉంటానని గతేడాది జూన్‌లో జైలు నుంచి విడుదల అయ్యాడు. అనంతరం రాజే్‌షరావు జులాయిగా తిరుగుతూ పలువురిని తల్వార్‌తో బెదిరిస్తున్నాడు.


ఇదే క్రమంలో మండలంలోని నసర్లపల్లి గ్రామానికి చెందిన ఒక రైతును తల్వార్‌తో బెదిరించాడు. సదరు రైతు చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాజే్‌షరావుతో పాటు అతని అనుచరుడు నాగరాజును పోలీసులు ఆదివారం అరె్‌స్టచేసి వారివద్ద ఒక తల్వార్‌, వేట కొడవలి, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని జైలుకు పంపినట్లు సీఐ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న  ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వర్లు, సిబ్బంది లింగయ్య, రమేష్‌, సైదులును సీఐ అభినందించారు. 

Updated Date - 2020-07-13T11:14:59+05:30 IST