పారుపాకలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

ABN , First Publish Date - 2022-01-23T05:18:54+05:30 IST

రౌతులపూడి, జనవరి 22: మండలంలోని పారుపాకలోని ఊరకొండ వద్ద గ్రావెల్‌ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్స్‌కవేటర్లతో రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక ్టర్‌ రూ.600 వరకు అమ్ముతున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం అనుమతి లేనిదే గ్రావెల్‌ తవ్వకాలు జరపకూడదు. కానీ ఇక్కడ నిబంధనలతో పనిలేకుండా ఇష్టానుసారంగా తవ్వుతున్నారు. 50సెంట్ల స్థల విస్తీర్ణం వర

పారుపాకలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు
గ్రావెల్‌ తవ్వుతున్న దృశ్యం

రౌతులపూడి, జనవరి 22: మండలంలోని పారుపాకలోని ఊరకొండ వద్ద గ్రావెల్‌ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్స్‌కవేటర్లతో రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక ్టర్‌ రూ.600 వరకు అమ్ముతున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం అనుమతి లేనిదే గ్రావెల్‌ తవ్వకాలు జరపకూడదు. కానీ ఇక్కడ నిబంధనలతో పనిలేకుండా ఇష్టానుసారంగా తవ్వుతున్నారు. 50సెంట్ల స్థల విస్తీర్ణం వరకు 20 మీటర్లు లోతుకు తవ్వేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-23T05:18:54+05:30 IST