Today IPL Match: GT vs RCB.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో ఈ అంచనాతో తేల్చేయండి..

ABN , First Publish Date - 2022-05-19T23:05:38+05:30 IST

ఐపీఎల్ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కాబోతోంది. గుజరాత్ టైటాన్స్‌, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల..

Today IPL Match: GT vs RCB.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో ఈ అంచనాతో తేల్చేయండి..

ముంబై: ఐపీఎల్ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కాబోతోంది. గుజరాత్ టైటాన్స్‌, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య గురువారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ప్లే-ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన జట్టు గుజరాత్ టైటాన్స్. ప్లే-ఆఫ్స్‌లో అర్హత కోసం పోటీ పడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే-ఆఫ్ ఆశలను సజీవం చేసుకోవాలని భావిస్తోంది. 13 మ్యాచ్‌లు ఆడిన RCB జట్టు 7 మ్యాచ్‌ల్లో గెలిచి 6 మ్యాచుల్లో ఓడింది. 14 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. రన్‌రేట్ మైనస్‌లో ఉండటం RCBకి ప్రతికూల అంశం. ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు ఒక్కటే సరిపోదు.



ప్లే-ఆఫ్స్ అర్హత కోసం పోటీ పడుతున్న ఇతర జట్ల గెలుపోటములు కూడా RCB ప్లే-ఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ప్లే-ఆఫ్స్‌కు క్వాలిఫై అయి ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో అగ్ర స్థానంలో నిలిచింది. 13 మ్యాచుల్లో 10 మ్యాచ్‌లు గెలిచి Gujarat Titans జట్టు సత్తా చాటింది. సాహా మంచి ఫామ్‌లో ఉండటం హార్థిక్ సేనకు మరింత కలిసొచ్చే అంశం.

Updated Date - 2022-05-19T23:05:38+05:30 IST