ఆర్టీసీలో రాచరిక పాలన

ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST

ఆర్టీసీలో రాచరిక పాలన

ఆర్టీసీలో రాచరిక పాలన
షాద్‌నగర్‌ డీపో ముందు నిరసన తెలుపుతున్న కార్మికులు

 పరిగి, మే24 : ఆర్టీసీలో రాచరికపాలనను మానుకోవాలని ఆర్టీసీ జేఏసీ వైస్‌చైర్మన్‌ కె.హన్మంత్‌ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు పరిగి డిపో వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  కె.హన్మంత్‌ మాట్లాడుతూ కార్మికుల చట్టాలను గౌరవించి ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలన్నారు. పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఎనిమిదేళ్ళ నుంచి వేతనాలు, ఆరు డీఏలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  రూ.2,793 కోట్ల పొదుపు డబ్బులను కూడా వాడుకుని కార్మికుల రక్తం పీల్చుకు తాగుతున్నారని విమర్శించారు. స్పెషల్‌ డ్యూటీల పేరిట కార్మికులను హింసిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై జూన్‌ 14న అన్ని రాజకీయ పార్టీలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కృష్ణ, శంషొద్దీన్‌, కళ్యాణి, అనిత, లక్ష్మి పాల్గొన్నారు. 

  •  వేధింపులు ఆపాలని ఆర్టీసీ కార్మికుల నిరసన

షాద్‌నగర్‌రూరల్‌, మే24: తమపై వేధింపులు ఆపి తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మంగళవారం షాద్‌నగర్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. రోజురోజుకు కార్మికులపై వేధింపులు అధికమౌతున్నాయని, తద్వారా అభద్రత భావం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ల ఏర్పాటుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. వాడుకున్న తమ డబ్బులను వెంటనే తిరిగి చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో స్వాములయ్య, రవిచందర్‌, రాముడు, భూపాల్‌, సుగుణమ్మ, శారద, శాంతమ్మ, అక్బర్‌అలీ, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:30:00+05:30 IST