ఈ కానిస్టేబుల్‌కు సెల్యూట్

ABN , First Publish Date - 2020-11-15T00:10:58+05:30 IST

పండుగ రోజు ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు ఆర్ఫీఎఫ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్. గుజరాత్‌లోని దాహోద్ రైల్వేస్టేషన్‌లో ఘటన జరిగింది. రైలెక్కడానికి ప్రయత్నించడానికి ఒకతను..

ఈ కానిస్టేబుల్‌కు సెల్యూట్

గుజరాత్: పండుగ రోజు ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు ఆర్ఫీఎఫ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్. గుజరాత్‌లోని దాహోద్ రైల్వేస్టేషన్‌లో ఘటన జరిగింది. రైలెక్కడానికి ప్రయత్నించడానికి ఒకతను జారీ పోయి పడిపోయాడు. రైలుకు, ఫ్లాట్ ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుని పోయాడు. కదులుతున్న రైలు అతన్ని అలా లాక్కుని పోతూ ఉండటాన్ని గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బాబూ రాథోడ్ అతన్ని పట్టుకుని అలానే రైలు వెంట పరిగెత్తాడు. ఇంతలో రైలు ఆగడంతో ప్రమాదం తప్పింది. రైలు ఆగాక జాగ్రత్తలు చెప్పి అతన్ని రైలు ఎక్కించిన ఆర్పీఎఫ్ పోలీస్ కానిస్టేబుల్‌కు రైల్లోని ప్రయాణికులు, స్టేషన్‌లో ఉన్న వారు సెల్యూట్ చేశారు.

Updated Date - 2020-11-15T00:10:58+05:30 IST