Advertisement

భూనిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ

Mar 2 2021 @ 01:19AM
భూ నిర్వాసితులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ దేశ్యానాయక్‌

దేవరకొండ, మార్చి 1:  భూనిర్వాసితులకు  ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేస్తామని తహసీల్దార్‌ దేశ్యానాయక్‌ అన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన వెంకేపల్లి, వెంకేపల్లితండా భూనిర్వాసితులతో సర్వే నిర్వహించేందుకు సోమవారం మర్రిగూడ తహసీల్దార్‌ దేశ్యానాయక్‌ వెంకేపల్లిలో సమావేశం అయ్యారు. వెంకేపల్లి గ్రామంలో 600ఎకరాలకు సర్వే నిర్వహించకపోవడంతో అక్కడి భూనిర్వాసితులకు వివిధ కారణాల వల్ల పరిహారం అందలేదు. అయితే ఇటీవల సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తుండగా అక్కడి భూనిర్వాసితులు తహసీల్దార్‌ దేశ్యానాయక్‌కు భూములపై సర్వే నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్‌ వెంకేపల్లి గ్రామానికి వెళ్లి భూనిర్వాసితులతో, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమై రికార్డులు పరిశీలించారు. మొత్తం 600ఎకరాల పట్టాభూములు, 200ఎకరాల అసైన్డ్‌ భూములకు సర్వే నిర్వహించలేని తెలిపారు. అయితే ఆర్‌అండ్‌ఆర్‌ 2013 భూసేకరణచట్టం ప్రకారం భూనిర్వాసితులకు పరిహారం అందేవిధంగా  సర్వే చేశామన్నారు. ఈ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తహసీల్దార్‌ దేశ్యానాయక్‌ తెలిపారు.

Follow Us on:
Advertisement