ఆర్‌ఆర్‌బీ పరీక్షల కోసం తెలుగు రాష్ట్రాలకు రెండు ప్రత్యేక రైళ్లు

Published: Sat, 07 May 2022 11:48:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆర్‌ఆర్‌బీ పరీక్షల కోసం తెలుగు రాష్ట్రాలకు రెండు ప్రత్యేక రైళ్లు

బెంగళూరు: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రెండు ప్రత్యేక రైళ్లను ఈనెల 9న నడపనున్నారు. ఈ మేరకు నైరుతి రైల్వేజోన్‌ బెంగళూరులో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పాండవపుర నుంచి కాకినాడ పట్టణానికి ప్రత్యేక రైలు ఈనెల 9న ఉదయం 11.45 గంటలకు బయల్దేరి వెళుతుంది. 10న రాత్రి 7 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఈ రైలుకు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌, కృష్ణరాజపురం, బంగారపేట, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో స్టాప్‌లు ఉంటాయి. కాగా 9న మైసూరు నుంచి ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక రైలు హైదరాబాద్‌కు బయల్దేరుతుంది. ఈ రైలు సిటీ రైల్వేస్టేషన్‌, బంగారపేట, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్‌, కర్నూలు, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, కాచిగూడ, సికింద్రాబాద్‌లో స్టాప్‌లు ఉంటాయని రైల్వే ప్రకటన పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్‌ చార్జీలు 30 శాతం అధికంగా ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.