అమెరికన్ బాక్సాఫీస్‌పై వార్.. RRR @106కోట్లు.. KGF-2 @15.26కోట్లు

Published: Sun, 17 Apr 2022 10:06:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమెరికన్ బాక్సాఫీస్‌పై వార్.. RRR @106కోట్లు.. KGF-2 @15.26కోట్లు

ఓవర్సిస్ సినిమా: ఈ నెల 14న విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్-2', అంతకుముందు మార్చి 25న రిలీజ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అగ్రరాజ్యం అమెరికాలో రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్నాయి. ఈ రెండు సినిమాలు యూఎస్‌లో భారీ మొత్తంలో కలెక్షన్‌లను రాబడుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' 14మిలియన్లు(రూ.106.86కోట్లు) రాబడితే.. 'కేజీఎఫ్-2' రెండు మిలియన్ల(రూ.15.26కోట్లు) మార్క్‌ను అందుకుంది. అగ్రరాజ్యంలో ఈ రెండు చిత్రాలను విడుదల చేసిన సరిగమ సినిమాస్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన 'బాహుబలి-2' అమెరికాలో మొత్తంగా 20 మిలియన్ల(సుమారు రూ.152కోట్లు) కలెక్షన్లతో టాప్‌లో ఉంది. బాహుబలిని 'ఆర్ఆర్ఆర్' అందుకోవాలంటే ఇంకా 6 మిలియన్లు రాబట్టాలి. కానీ, ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'కు ఇది సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా స్క్రీన్లను కేజీఎఫ్ అక్రమించేసింది. దీంతో ఆటోమెటిక్‌గా 'ఆర్ఆర్ఆర్' వసూళ్లు తగ్గాయి.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.