
ఓవర్సీస్ సినిమా: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో కొమురం భీమ్‌గా జూ.ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా సుమారు 11వేలకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంతో జక్కన్న మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్, రాంచరణ్ తమ నటనతో మెస్మరైజ్ చేశారు. భారీ వ్యయంతో నిర్మితమైన ఈ మూవీ.. అంతే భారీ అంచనాలతో రిలీజ్ కావడం.. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కుమ్మేస్తోంది.
అటు ఓవర్సీస్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ను మేకర్స్ భారీ స్థాయిలోనే విడుదల చేశారు. దీంతో అక్కడ కూడా కనక వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ మూవీని సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ దేశ వ్యాప్తంగా దాదాపు 1150కు పైగా లొకేషన్స్‌లో విడుదల చేశాయి. దాంతో ప్రీమియర్స్, తొలిరోజు వసూళ్లు కలిపి 5మిలియన్ల మార్క్‌ను(రూ.38.13) దాటేసింది. ఈ విషయాన్ని సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్.. ట్విటర్ ద్వారా వెల్లడించాయి. దీంతో 'బాహుబలి-2'(4.59 మిలియన్ల) రికార్డు బద్దలైంది. ఇక పూర్తి రన్‌టైమ్‌లో 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి