Advertisement

భ‌ళా! ముంద‌స్తు వ్యాపారం

Oct 14 2020 @ 19:16PM

తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, ఆంధ్ర‌ప్రాంతానికి చెందిన మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కోవిడ్ టైమ్‌లో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఈసినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను రీస్టార్ట్ చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు కార‌ణంగా షూటింగ్ పూర్తికాక‌పోయిన‌ప్ప‌టికీ ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల‌ను ఓ ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ‌, ఛానెల్ రూ.200 కోట్ల‌ను వెచ్చించి కోనుగోలు చేశాయ‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దాదాపు రూ.450 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి అప్పుడే రూ.200 కోట్లు రావ‌డం గొప్ప విష‌య‌మే అయినా, క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో అందులో విశేష‌మేమీ లేద‌ని కొంద‌రు అంటున్నారు.  

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.