ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌

Jul 30 2021 @ 18:54PM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం ఉక్రెయిన్‌కు పయనం కానుంది. కరోనా సెకెండ్‌ వేవ్‌ తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభించిన రాజమౌళి అండ్‌ కో ఇటీవల ఈ షూటింగ్‌ పూర్తి చేసింది. హీరోలిద్దరిపై కీలక సన్నివేశాలను రామ్‌చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించారు. ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌ ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే చిత్ర బృందం ఉక్రెయిన్‌కి బయలుదేరిందని తెలిసింది. ఒకటో తేదిన ప్రధాన తారాగణం, దర్శకుడు అక్కడికి చేరుకుని రెండో తేదిన షూటింగ్‌ మొదలుపెడతారని సమాచారం. ఆగస్ట్‌ రెండోవారం వరకూ చిత్రీకరణ జరుగుతుందనీ, కీరవాణి స్వరకల్పన చేసిన ప్రత్యేక గీతాన్ని దర్శకుడు రాజమౌళి గ్రాండియర్‌గా తెరకెక్కించనున్నారట. డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.