సారథి స్టూడియోలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’!

Jun 21 2021 @ 20:47PM

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రధారులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే! ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో సినిమా మళ్లీ సెట్‌ మీదకెళ్లింది. సోమవారం సారథి స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభమైంది. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారట. మంగళవారం ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలు ప్లాన్‌ చేశారని తెలిసింది. అలియాభట్‌, ఒలివియా మోరీస్‌, అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.