దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఇటీవల 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌ని రాత్రివేళల్లో చిత్రీకరించిన చిత్రయూనిట్.. ఇక నైట్ షూట్లకు సెలవు అంటూ తెలిపింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న షెడ్యూల్‌ని జక్కన్న మహాబలేశ్వర్‌లోని అందమైన లొకేషన్స్‌లో ప్లాన్ చేశారు. అంతే కాదు షూట్ కూడా అక్కడ మొదలైనట్లుగా ఓ వీడియోను 'ఆర్ఆర్ఆర్' టీమ్ విడుదల చేసింది.
ఆర్ఆర్ఆర్ డైరీస్ అంటూ చిత్రయూనిట్ షేర్ చేసిన ఈ వీడియోలో మూవింగ్ క్రేన్ షాట్లు, డ్రోన్ షాట్లలతో బైక్ మీద వెళుతున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ షూట్లో జాయిన్ అవుతారని చిత్రయూనిట్ పేర్కొంది. దీంతో కరోనా ముందు వరకు నత్తనడకన సాగిన ఈ చిత్ర షూటింగ్‌ని జక్కన్న పరుగులు పెట్టిస్తున్నాడని ఇప్పుడంతా అనుకుంటున్నారు.