
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు శుభవార్త. `ఆర్ఆర్ఆర్`కు సంబంధించిన అప్డేట్ గురించి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడబోతోంది. సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించేందుకు `ఆర్ఆర్ఆర్` యూనిట్ సిద్ధమవుతోంది. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు `ఆర్ఆర్ఆర్` సినిమాకు సంబంధించి అప్డేట్ బయటకు రాబోతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది.
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ మధ్య ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చేందుకు రాజమౌళి టీమ్ సిద్ధమైంది. మరి, ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే మరో రెండు గంటలు ఆగాల్సిందే.