ltrScrptTheme3

చేనేతల అభివృద్ధి కోసం రూ.1,200 కోట్లు: కేటీఆర్

Aug 7 2021 @ 14:12PM

హైదరాబాద్: చేనేతల అభివృద్ధి కోసం రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని, ప్రభుత్వ ఉద్యోగులను కోరుతున్నామని చెప్పారు. పీపుల్‌ప్లాజాలో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 31 మంది ఉత్తమ చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులతో పాటు కేటీఆర్ పురస్కారాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేతలను ప్రోత్సహించేందుకు అవార్డ్స్ అందిస్తున్నామని  చెప్పారు. ఈ కామర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేల్స్ చేస్తున్నామని, టెస్కో ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు.

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.